మృదువైన చేతుల్ని ముద్దులొలికే విధంగా చేసుకోవచ్చు. ఎంతో కష్టపడి వేసుకున్న మెహందీ డిజైన్లు ఎక్కువకాలం ఉండాలంటే కింది సూచనలు పాటించండి.
గోరింటాకు పేస్ట్ డిజైన్ రూపంలో చేతులపై తీర్చిదిద్దాక వీలైనంత ఎక్కువ సమయం అలాగే ఉంచుకునే ప్రయత్నం చెయ్యాలి. చక్కెర, నిమ్మరసాల మిశ్రమాన్ని మాటిమాటికీ అరచేతులపై ఆప్లయ్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే గోరింటాకు ఎండిపోకుండా ఉంటుంది. అలాగే వీలైనంత ఎక్కువ వెచ్చదనాన్ని అందజేయాలి.
ఇంట్లో ఉండేవారు పాన్‌పై కొంచెం ఇంగువ వేసి వేడిచేసి వచ్చే పొగపై చేతులను పెట్టి కాచుకోవాలి. మాటిమాటికీ గోరింటాకును చేతులతో కదిపే ప్రయత్నం చెయ్యకూడదు. గోరింటాకు పౌడర్‌ను ముందుగా నీళ్లల్లో నానబెట్టి అందులో ఒక అరచెమ్చా కాసు వేసి ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవాలి.
పిప్పర్‌మెంట్‌ను నూరి గోరింటాకు పేస్ట్‌కు కలిపితే అది బాగా ఎర్రగా పండుతుంది. మార్కెట్లో పిప్పర్‌మెంట్ నూనె లభిస్తుంది. ఒక సారి తయారు చేసుకున్న గోరింటాకు పేస్ట్‌ను మళ్ళీ ఇంకోసారి ఉపయోగించుకోవాలని అనుకునేవారు దీనిని ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవచ్చు.