మొటిమలు తగ్గాలంటే నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్లు, పీచు సమృద్ధిగా వుంటాయి. బాదం పప్పులను పొడి చేసి నీళ్లలో నానబెట్టి పాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టి ముఖంపై రాసుకోవాలి. ఇది ముఖం చర్మంలోని మృత కణాలను తొలగిస్తుంది. దాంతో ముఖం కళకళలాడిపోతుంది.
పాలిపోయిన చర్మాన్ని జీడిపప్పు మెరిసేలా చేస్తుంది. కాలి పగుళ్లను కూడా దూరం చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్-ఇ చర్మంపై వయసు ప్రభావం పడనీయకుండా కాపాడుతుంది. కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్, హై బీపీలను నియంత్రించడంలో తోడ్పడుతుంది. అలాగే, మైగ్రెయిన్ నొప్పితో బాధపడే వారికి జీడిపప్పు ఉపశమనం కలిగిస్తుంది.