అరటి పండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా..

గురువారం, 3 అక్టోబరు 2019 (11:46 IST)
అరటి పండు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మేలు చేస్తుంది. అలాంటి అరటిపండుతో ఎన్ని రకాల ఫేస్‌ప్యాక్‌లు తయారు చేసుకోవచ్చో, అవి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం....
 
అరటిపండు గుజ్జులో కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై మాస్క్‌లా వేసుకోవాలి. అరగంట తర్వావాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అరటిపండులో ఉండే యాంటి బ్యాక్టీరియల్ గుణాలు, విటమిన్ ఎ, పొటాషియం వంటివి చర్మానికి మృదుత్వాన్ని కలిగిస్తుంది.
 
అరటిపండు గుజ్జుని కళ్ల చుట్టూ రాసుకొని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కంటి చుట్టు ఏర్పడే నల్లటి వలయాలు తగ్గిపోయి తాజాగా మారుతుంది.
 
అరటిపండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం నిగనిగలాడుతుంది.
 
అరటి గుజ్జులో కొంచెం శనగపిండి, కొంచెం పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మృత కణాలు తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు