సౌందర్య పోషణలో నిమ్మరసం ప్రత్యేకత ఎంతో ఉంది. ముఖంపై నల్లటి మచ్చలు, తెల్లటి మచ్చలను, చర్మరంధ్రాలను తొలగిస్తుంది. మొటిమల నివారణకు నిమ్మ ఎంతో దోహదపడుతుంది. స్పూన్ నిమ్మరసంలో కాటన్ బాల్ ముంచి ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే నల్లటి మచ్చలు పోతాయి. అలానే నిమ్మరసంలో రెండు మూడు చుక్కల తేనె కలిపి ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా, ప్రకాశవంతంగా మారుతుంది.
ఓ చిన్న టమోటాని తీసుకుని గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలతో ముఖాన్ని 5 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. ఆ తరువాత ఓ స్పూన్ నారింజ రసంలో కొద్దిగా పాలపొడి, గంధం, తేనె వేసి కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 10 నిమిషాల తరువాత కడిగేస్తే ముఖం తాజాగా నిగనిగలాడుతుంది.