రాజేష్ మేరు, నవ్య చిత్యాల హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'లగ్గం టైమ్'. ఈ సినిమాలో నెల్లూరు సుధర్శన్, ప్రీతి సుందర్, ప్రణీత్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రజోత్ కె వెన్నం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి పవన్ గుంటుకు సినిమాటోగ్రాఫర్. ఇక పవన్ సంగీతంలో రూపుదిద్దుకున్న పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. 'ఏమైందో గాని' పాట అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది. '20th సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్' నిర్మాణంలో కె.హిమ బిందు నిర్మిస్తున్న రామ్ కామ్ ఎంటర్టైనర్ ఇది.