బ్యూటీ టిప్స్.. పుదీనాతో ఫేస్ ప్యాక్ ఎలా..? (Video)

బుధవారం, 29 నవంబరు 2017 (13:34 IST)
పసుపు, పుదీనా చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తాజా పుదీనా ఆకులను మెత్తని పేస్టులా చేసి.. పసుపు అరస్పూన్ కలిపి.. ముఖానికి పూతలా వేసుకోవాలి. ప్యాక్ వేసేముందు గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆపై ఈ పేస్టుతో ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. సోయాబీన్‌ను మెత్తగా రుబ్బుకుని పచ్చిపాలను కలిపి ముఖానికి రాస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
ఇంకా నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో కలిపి రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శెనగపిండి, నెయ్యి, పసుపు కలిపి పేస్టులా తయారు చేసి చర్మంపై రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత మృదువుగా గుండ్రంగా మసాజ్ చేయాలి ఇలా చేయడం ద్వారా పొడిబారిన చర్మంపై ఉన్న మురికి తొలగిపోతుంది. ప్రతిరోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి... రోజూ ఈ టిప్స్ పాటిస్తే చర్మం తాజాగా వుంటుంది. 
 
కలబంద గుజ్జులో కొంచెం పసుపు, తేనె, మీగడతో పాటు గులాబీ రసం కలిపి మిశ్రమం చేసి.. ఆ పేస్టును ముఖానికి పూతలా వేసి పావు గంట తర్వాత కడిగేస్తే మచ్చలు, కాలిన గాయాలు, మొటిమల తాలూకు మచ్చలుపోతాయి. కలబంద గుజ్జులో కొంచెం గులాబీ రసం కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం తాజాగా వుంటుంది.

కలబంద గుజ్జులో కాస్త నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులపై రాసుకుంటే నలుపుదనం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు