కలబంద గుజ్జు, నిమ్మరసంతో ప్యాక్ వేసుకుంటే..?

శనివారం, 12 జనవరి 2019 (15:53 IST)
దైనందిన కార్యకలాపాల్లో బిజీ బిజీగా గడిపే మగువలు రిలాక్సేషన్ కావాలనుకుంటే.. దాల్చినచెక్కతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే, హాయిగా ఉండటమే కాకుండా అందం మరింత ద్విగుణీకృతం అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్‌కు కావల్సిన పదార్థాలేంటంటే.. దాల్చినచెక్క పొడి.. పావు టీస్పూన్, చిన్న కీరా.. ఒకటి, పెసర పిండి.. రెండు టీస్పూన్లు.
 
కీరాను ముక్కలుగా చేసి మిక్సీలో వేసి పేస్ట్‌లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో పెసరపిండిని వేసి బాగా కలియబెట్టాలి. చివరగా దాల్చిన చెక్క పొడిని వేసి కలపాలి. చన్నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత పేస్ట్ చేసిన మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అలాగే గుండ్రంగా కట్ చేసిన రెండు కీరా ముక్కలను కళ్లపైన ఉంచి అరగంటసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఈ ప్యాక్ రాత్రిపూట వేసుకుంటే ఉదయపు బడలిక అంతా మటుమాయమై రిలాక్సేషన్‌తోపాటు చర్మకాంతి కూడా పెరుగుతుంది.
 
కలబంద గుజ్జును తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్, తేనె కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం కడ్కుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖం చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు