సాధారణంగా కీరా దోసకాయ తినేటప్పుడు ప్రతి ఒక్కరు తొక్కను తీసి తింటారు. తొక్క తీసి వేయడం వల్ల దానిపై చేరిన వాతావరణ కాలుష్య పదార్థాలు తొలగిపోతాయి. అయితే వీటితో పాటుగా ఎన్నో అత్యవసర పోషకాలు కూడా తొలగిపోతాయి. అలాకాకుండా కొంచెం నీటిలో ఉప్పు వేసి కీరదోసని కాసేపు ఆ నీటిలో ఉంచి శుభ్రంగా కడిగి తొక్కతో సహా కీరదోసని తినడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో చూద్దాం.
4. కీరాను ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయవచ్చు, ఎందుకంటే, వీటిలో సహజంగా కెలోరీలు తక్కువగా ఉంటాయి. ఒక కీరా ముక్కలో 1-2 కెలోరీలు ఉంటాయి. డైటింగ్ చేస్తున్నప్పటికి, మధ్యాహ్న సమయాల్లో కొన్ని తొక్క తీయని కీరా ముక్కలు తినడం వలన ఎటువంటి నష్టం వుండదు.