తిరిగి రెండెంకెలకు చేరిన ఆహార ద్రవ్యోల్బణం

గురువారం, 1 సెప్టెంబరు 2011 (12:54 IST)
బంగాళదుంపలు, ఉల్లి, పండ్ల ధరలు పెరగడంతో గురువారం విడుదల అయిన అధికారిక గణాంకాల ప్రకారం భారత వార్షిక ఆహార ద్రవ్యోల్బణం ఆగస్ట్ 20తో ముగిసిన వారానికి క్రితం వారంలో నమోదైన 9.80 శాతం నుంచి 10.05 శాతానికి ఎగసింది.

టోకు ధరల సూచీలో 20.12 శాతం వాటా ఉన్న ప్రాధమిక వస్తువుల సూచీ గత వారంలో నమోదైన 198.5 నుంచి 1.2 శాతం పెరిగి 200.9కి హెచ్చించింది. కాగా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, నాఫ్తాల్‌ల ధరలు తగ్గిన కారణంగా ఇంధన, విద్యుత్ సూచీ 0.4 శాతం క్షీణించి 167.2 నుంచి 166.8కి చేరడం విశేషం.

భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. 2010 మార్చి నుంచి ఆర్‌బీఐ ఇప్పటికీ 11సార్లు కీలక పాలసీ రేట్లను పెంచింది. గత నెలలో తన విధాన సమీక్షలో భాగంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి