భారత్ ఫైబర్ తమ వినియోగదారులకు ఏడాది పాటు రూ. 999 విలువైన అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఈ ఆఫర్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.777 (18జీబీ) మరియు అంతకన్నా ఎక్కువ విలువైన ప్లాన్‌లను వినియోగిస్తున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అర్హత ఉన్న వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌కి వెళ్లి ఈ ఆఫర్‌ను పొందవచ్చు.
ఇప్పటికే భారతదేశంలో అమెజాన్ ప్రైమ్ సేవలు విస్తృతంగా వ్యాపిస్తున్నాయి, అలాగే దీని వీక్షకులు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆఫర్ పట్ల చాలామంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారుల ప్రాధాన్యతలను అర్థం చేసుకుని, వారి అభిరుచికి అనుగుణంగా ఈ ఆఫర్‌ను ప్రకటించామని బిఎస్ఎన్ఎల్ డైరెక్టర్, సీఈవో వివేక్ బంజల్ చెప్పారు.