రూ.200 నోటును ఆర్బీఐ రద్దు చేయనుందా?

ఠాగూర్

శుక్రవారం, 17 జనవరి 2025 (17:42 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త కరెన్సీ నోటులను చెలామణిలోకి తీసుకొచ్చారు. గతంలో రూ.1000 నోటును రద్దు చేసి, రూ.2000 వేల నోటును చలామణిలోకి తీసుకొచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఈ నోటును కూడా రద్దు చేశారు. అలాగే, కొత్తగా తీసుకొచ్చిన రూ.200 నోటును కూడా రద్దు చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై భారత రిజర్వు బ్యాంకు క్లారిటీ ఇచ్చింది. 
 
పెద్ద నోట్ట వల్లే దేశంలో అవినీతి పెరుగుతుందని ఆర్బీఐ భావిస్తోంది. చరిత్రలో జరిగిన ఘటనలు చూస్తుంటే ఇదే నిజమే అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలు అవినీతి పెరుగుతుందని భావించి దశల వారీగా పెద్ద నోట్లను రద్దు చేసేందుకు ప్రయత్నించాయి. ఇందులో భాగంగానే రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్ల రద్దు జరిగింది.
 
2016 నవంబరులో రూ.500, రూ.1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో రూ.2000 వేల నోటును తీసుకువచ్చింది. అయితే రూ.2 వేల నోట్లను వెనక్కు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ 2023 మే 19వ తేదీన మొదటిసారిగా ప్రకటించింది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవచ్చని ఆర్బీఐ సూచించింది. అర్బీఐ ప్రకటనతో జనం తమ దగ్గరున్న రూ.2 వేల నోటును మార్పిడి చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.2 వేల నోట్లు దాదాపు 99 శాతం వెనక్కి వచ్చాయి.
 
ప్రస్తుతం మార్కెట్లో పెద్ద నోట్లుగా ఉన్న రూ.500 నోట్లకు నకిలీలు హల్ చల్ చేస్తున్నాయి. అందుకే ఆర్బీఐ ప్రజలను అప్రమత్తం చేయడానికి ఫేక్ కరెన్సీని గుర్తించే సూచనలు చేస్తోంది. ఇప్పటికే రూ.2,000 నోట్లు, రూ.500 నోట్ల గురించి సూచనలు చేసిన ఆర్బిఐ ఈ మధ్యే 200 రూపాయల నోట్ల గురించి సూచనలు చేసింది. ఎందుకంటే రూ.200 రూపాయల నోట్లకు కూడా నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చేశాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటిని నిజం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో 200 రూపాయల నోట్లకు కలర్ జిరాక్సులు తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు