Bank holidays 2025 కొత్త సంవత్సరంలో బ్యాంక్ సెలవులు ఇవే...

ఠాగూర్

బుధవారం, 1 జనవరి 2025 (16:13 IST)
Bank holidays 2025 కొత్త సంవత్సరం 2025లోకి అడుగుపెట్టాం. ఎన్నో ఆశలు, ఆశయాలతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించాం. క్యాలెండరులో తేదీలు మారినప్పటికీ సగటు మనిషి ఆర్థిక కష్టాలు మాత్రం ఎన్నిటికీ తీరిపోవు. ఈ క్రమంలో నూతన సంవత్సరంలో ఎప్పటికప్పుడు మారే ఆర్థిక అంశాలతో పాటు ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోవడం ముఖ్యం. అలా ఈ యేడాది బ్యాంకు సెలవులు, స్టాక్‌ మార్కెట్లు పనిచేయని తేదీలు, ఐటీఆర్‌కు సంబంధించి గడువు తేదీనలను ఓ సారి పరిశీలిస్తే, 
 
బ్యాంక్‌ సెలవులు
జనవరి 14 (మంగళవారం) - మకర సంక్రాంతి
ఫిబ్రవరి 26 (బుధవారం) - మహా శివరాత్రి
మార్చి 14 (శుక్రవారం) - హోలీ
మార్చి 30 (సోమవారం)- రంజాన్‌
ఏప్రిల్‌ 01 (మంగళవారం) - ఆర్థిక వార్షిక సంవత్సర ప్రారంభం
ఏప్రిల్‌ 05 (శనివారం)- జగ్జీవన్‌రాం జయంతి
ఏప్రిల్‌ 14 (సోమవారం) - అంబేడ్కర్‌ జయంతి
ఏప్రిల్‌ 18 (శుక్రవారం) - గుడ్‌ఫ్రైడే
మే 01 (గురువారం) - మే డే
జూన్‌ 7 (శనివారం) - బక్రీద్‌
ఆగస్టు 15 (శుక్రవారం) - స్వాతంత్య్ర దినోత్సవం
ఆగస్టు 16 (శనివారం) -  శ్రీ కృష్ణ జయంతి 
ఆగస్టు 27 (బుధవారం) - వినాయక చవితి
సెప్టెంబరు 5 (గురువారం) - మిలాద్‌- ఉన్‌-నబి
అక్టోబరు 2 (గురువారం) - గాంధీ జయంతి
అక్టోబరు 20 (సోమవారం) - దీపావళి
నవంబరు 5 (బుధవారం) - గురునానక్‌ జయంతి
డిసెంబరు 25 (గురువారం) - క్రిస్మస్‌
 
తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకుల పని దినాలకు సంబంధించి ఆర్‌బీఐ వెలువరించిన సెలవుల జాబితా ఇది. సాధారణంగా ప్రతి నెలా రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలు బ్యాంకులు పనిచేయవు. అలాగే, పండగలు, ఇతర ముఖ్యమైన రోజుల్లో బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ తేదీలను గుర్తుపెట్టుకోవాలి. స్థానిక పండగల ప్రాధాన్యం దృష్ట్యా ఇతర రాష్ట్రాల్లో ఈ తేదీల్లో మార్పులుంటాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు