2007లో స్థాపించబడిన ఫ్లిప్‌కార్ట్ లక్షలాది మంది విక్రేతలు, వ్యాపారులు, చిన్న వ్యాపారాలను భారతదేశ డిజిటల్ వాణిజ్య విప్లవంలో పాల్గొనేలా చేసింది. ప్రస్తుతం, ఇది 500 మిలియన్ల కంటే ఎక్కువ నమోదిత వినియోగదారుని కలిగి ఉంది. మార్కెట్‌ప్లేస్ 80 కంటే ఎక్కువ వర్గాలలో 150 మిలియన్లకు పైగా ఉత్పత్తులను అందిస్తుంది.
ఇంకా ఫ్లిఫ్ కార్ట్ తాజాగా సేమ్ డే డెలివరీని అందుబాటులోకి తెచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువులను బుక్ చేసిన రోజునే కస్టమర్లకు అందించనుంది. దేశంలో ఎంపిక చేసిన 20 నగరాల్లో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభించింది. దేశంలో ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రానున్న నెలల్లో దేశంలోని మరిన్ని నగరాలకు ఈ సేవలను ఫ్లిఫ్ కార్ట్ తీసుకురానుంది.