పెన్షన్లలో కోత : క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (16:13 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. పైగా, ఈ కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. దీంతో అనేక రంగాల్లో నిధుల కోత విధిస్తున్నారు. ఇప్పటికే, ఎంపీ లాడ్స్ నిధులతో పాటు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఎంపీల వేతనాల్లో కూడా కోత విధించారు. 
 
అలాగే, కరోనా మహమ్మారి కారణంగా దేశం తీవ్ర నష్టాల్లో ఉందని, దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లను తగ్గించడమో, పెన్షన్లను నిలిపివేయడమో చేస్తారంటూ కొన్నిరోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెన్షన్లలో కోత విధించే ఉద్దేశ్యం తమకు ఏదీ లేదని చెప్పారు. పైగా, ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వెల్లడించారు. 
 
'ఈ విషయం డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) దృష్టికి వచ్చింది. పెన్షన్లలో కోత ఉంటుందని, పెన్షన్లను నిలిపివేయవచ్చని పెన్షన్‌దారుల్లో సందేహాలు నెలకొన్నాయి. అయితే, పెన్షనర్లు నష్టపోయే చర్యలను కేంద్రం తీసుకోవడంలేదు. పెన్షనర్ల సంక్షేమానికి కేంద్ర ప్రబుత్వం కట్టుబడి ఉంది' అంటూ ఓ ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు