ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను వచ్చే నెల మూడో తేదీ వరకు పొడగిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. అంటే ఇపుడున్న పరిస్థితే అప్పటివరకు కొనసాగనుంది. అయితే, ఈ నెల 20వ తేదీ తర్వాత దేశంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష జరిపి లాక్‌డౌన్ నిబంధనలను సడలించే అవకాశం ఉన్నట్టు తెలిపారు.
అన్ని రకాల ప్యాసింజర్ రైళ్లు, ప్రీమియం రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సబర్బన్ రైళ్లు, మెట్రో రైల్ సర్వీసులను పూర్తి స్థాయిలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. తొలివిడత( ఏప్రిల్ 14) తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేస్తే రైలు సర్వీసులు తిరిగి ప్రారంభమౌతాయని అంతా ఆశించారు.