నేచురల్ సలోన్‌గా ప్రసిద్ధి చెందిన గ్రూమ్ ఇండియా సలోన్ అండ్ స్పా, తమ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా శ్రీ సంజయ్ ఎనిశెట్టిని నియమించుకున్నట్లు వెల్లడించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చింది. శ్రీ ఎనిశెట్టి పెట్టుబడులు, స్టార్టప్ రంగంలో 18 సంవత్సరాలకు పైగా విస్తృతమైన పరిజ్ఞానం, ప్రయోగాత్మక అనుభవం కలిగిన నిపుణులు.
ఈ నియామకం గురించి నేచురల్స్ సెలూన్స్ సహ వ్యవస్థాపకుడు, సిఎండి శ్రీ సికె కుమారవేల్ మాట్లాడుతూ, “వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్స్, స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌లలో 18 సంవత్సరాల అనుభవాన్ని సంజయ్ కలిగి ఉన్నారు. గత 7 నుండి 8 సంవత్సరాలుగా అతని గురించి తెలుసు, నేను అతని సామర్థ్యాన్ని ప్రత్యక్షముగా చూశాను. అతని వైవిధ్యమైన మనస్తత్వం, వ్యూహాత్మక విధానం ఖచ్చితంగా మేము అభివృద్ధి చెందడానికి అవసరమైనవి. అతని విస్తృతమైన అనుభవం, తాజా ఆలోచనలు అతన్ని నేచురల్స్ సలోస్‌ని ముందుకు తీసుకెళ్లడానికి సరైన నాయకుడిగా చేశాయి. 6 మిలియన్లకు పైగా విశ్వసనీయ కస్టమర్లతో, మేము మహిళా వ్యాపారవేత్తల యొక్క గొప్ప నెట్‌వర్క్‌ను నిర్మించాము. అయితే, భవిష్యత్తు అనేది బ్యూటీ-టెక్‌లో ఉందని మేము గుర్తించాము. ఏఐ మరియు ఇతర సాధనాలు సౌందర్య రంగంలో విప్లవాత్మక మార్పులు చేస్తాయి. సంజయ్ నాయకత్వంలో వృద్ధి, ఆవిష్కరణ, విజయాల యొక్క కొత్త అధ్యాయం కోసం నేను ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.
నూతన సీఈఓ శ్రీ సంజయ్ ఎనిశెట్టి మాట్లాడుతూ, “నేను నేచురల్స్ టీమ్‌లో చేరినందుకు ఆనందంగా ఉన్నాను. నేచురల్స్ అద్భుతమైన వ్యాపార నమూనా. ప్రతిభావంతులైన నిర్వహణ బృందాన్ని ఇది కలిగి ఉంది. మేము పరివర్తన యొక్క కొత్త దశను ప్రారంభిస్తున్న వేళ, వ్యూహం, బ్రాండ్ అభివృద్ధి, ఆవిష్కరణలలో నా విస్తృత అనుభవం మాకు బాగా ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించడం, బ్యూటీ సెగ్మెంట్‌లో టెక్, ఇన్నోవేటివ్ సొల్యూషన్‌లను పరిచయం చేయడం, మా బ్రాండ్‌ను మెరుగుపరిచే, వృద్ధిని పెంచే కొత్త కార్యక్రమాలను ప్రారంభించడంపై నా కీలక బాధ్యత ప్రాంతాలు దృష్టి సారిస్తాయి” అని అన్నారు.