గతేడాది ఫిబ్రవరి నాటి వసూళ్లతో పోల్చితే ఈసారి 7 శాతం అధికం అని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన నివేదికలో వివరించింది. గతేడాది ఫిబ్రవరితో పోల్చి చూస్తే ఈ ఫిబ్రవరిలో వస్తు దిగుమతులపై వసూళ్లు 15 శాతం అధికం అని, దేశీయ లావాదేవీలపై 5 శాతం ఎక్కువగా వసూళ్లు వచ్చాయని వెల్లడించింది.
కాగా, 2021లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు రూ.1.20 లక్షల కోట్లు వచ్చాయి. లాక్డౌన్ ఆంక్షలు ఉపసంహరించుకోవడంతో వ్యాపార, ఆర్థిక లావాదేవీలు ఒక్కసారిగా ఉరకలెత్తాయి. 2017లో జీఎస్టీ విధానం తీసుకువచ్చాక జనవరి వసూళ్లే అత్యధికం.
మరోవైపు, రాష్ట్రాలకు కేంద్రం 18వ విడత జీఎస్టీ పరిహారం కింద రూ.4 వేల కోట్లు విడుదల చేసింది. 23 రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ పరిహారం వర్తిస్తుంది. 2020 అక్టోబరు నుంచి విడుదల చేస్తున్న ఈ పరిహారం మొత్తం ఇప్పటివరకు రూ.1.04 లక్షల కోట్లకు చేరుకుంది.
ఈ సందర్భంగా ఏపీకి అదనపు రుణ సౌకర్యం కింద రూ.5,051 కోట్లు మంజూరు చేసింది. స్పెషల్ విండో ద్వారా ఏపీకి రూ.2,306 కోట్లు కేటాయించింది. అటు, తెలంగాణకు అదనపు రుణ సౌకర్యం కింద 5,017 కోట్లు కేటాయించగా, స్పెషల్ విండో ద్వారా రూ.2,027 కోట్లు మంజూరు చేయనుంది.