మహిళలకు తక్కువ వడ్డీతో గృహ రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు రెడీ అవుతున్నాయి. దీంతో అద్దింట్లో అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నవారికి ఇక సొంతిల్లు లభించినట్లవుతుంది. అందుకే అద్దెంట్లో ఉండే వారి కోసం ఇంటి రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తున్నాయి బ్యాంకులు. ఓ వైపు కేంద్రం రూ.30వేలకుపైగా నెల జీతం ఉన్నవారికి గృహ రుణాలపై సబ్సిడీ ప్రకటించింది. బ్యాంకులు సైతం గృహ రుణాలు సులభంగా ఇవ్వడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పుంజుకోనుంది.
తద్వారా సామాన్య, మధ్య తరగతి వారి కోసం రూ.9 నుంచి రూ.15 లక్షల వరకూ సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక రూ.20 నుంచి కూ.50 లక్షలు పెట్టేవారి కోసం డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ మాత్రం 60లక్షలకుపైనే ధర పలుకుతున్నాయి. మధ్య తరగతి జనం ఫ్లాట్ తీసుకోవాలంటే ఇదే మంచి అవకాశమంటున్నారు రియల్టర్లు.