నిరుద్యోగులకు కేంద్ర రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ రైల్వేలో 1.4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ వివరాలను వెల్లడించారు. 2014 నుంచి 2022 మధ్య భారత రైల్వేలో 3,50,204 మందికి ఉద్యోగం లభించిందన్నారు.