పంట మార్కెట్‌కు వచ్చే సమయంలో వ్యాపారులంతా సిండికేట్‌గా మారి నిమ్మ ధర తగ్గించేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడి భారీగా తగ్గిపోయిందని, ధర సైతం తగ్గిపోవడంతో నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు.
ధర అమాంతం తగ్గించి రైతుల నుంచి నిమ్మ పంటను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో మాత్రం నిమ్మ ధర ఏ మాత్రమూ తగ్గలేదు. డజను నిమ్మకాయలను సోమవారం రూ.వందకు విక్రయించారు. రైతులు, వినియోగదారులు నష్టపోతుండగా దళారులు భారీగా లాభపడుతున్నారు.