ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టమోటా మంట - కేజీపై రూ.50 పెరుగుదల

సోమవారం, 2 మే 2022 (14:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా, టమోటా ధర విపరీతంగా పెరిగిపోయింది. విజయనగరం జిల్లా లావేరు మార్కెట్‌లో పది రోజుల క్రితం కిలో టమోటా ధర రూ.20గా వుంది. అయితే, ప్రస్తుతం కిలో టమోటా ధర రూ.60కి పెరిగింది. దీంతో టమోటాలను కొనాలంటనే ప్రజలు భయపడిపోతున్నారు. 
 
తమ వద్ద కేజీ టమోటాలను రూ.10కి కొనుగోలు చేసే వ్యాపారులు ఇపుడు తమ వద్ద పంట లేకపోవడంతో ఒక సిండికేట్‌గా ఏర్పడి కిలో రూ.60కి అమ్ముతున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దీంతో దిగుబడి కూడా బాగా తగ్గిపోయింది. 
 
అటు మదనపల్లి మార్కెట్‌సో కూడా టమోటా ధరలు రోజురోజూకూ పెరిగిపోతున్నాయి. వారం రోజుల క్రితం నాణ్యమైన టమోటా రూ.30 నుంచి రూ.35 పలికింది. ఇపుడు రంజాన్ పండుగ సమీపించడంతో ఈ ధర రూ.55 నుంచి రూ.60కి చేరుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు