భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్గా పని చేస్తూ వచ్చిన రఘురాం రాజన్ ఆ పదవి నుంచి తప్పుకోవడానికి ఉన్న కారణాల్లో నోట్ల రద్దు ఒకటి అని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిదంబరం తెలిపారు. 'ఫియర్లెస్ ఇన్ అపోజిషన్, పవర్ అండ్ అకౌంట్బిలిటీ' పేరుతో ఆయన రాసిన పుస్తకం విడుదల సందర్భంగా చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు.