కొత్త కీ బోర్డును లాంచ్ చేసిన వన్‌ప్లస్.. ₹17,999 మాత్రమే...

బుధవారం, 11 అక్టోబరు 2023 (13:23 IST)
చైనా మొబైల్ తయారీ కంపెనీల్లో ఒకటైన వన్ ప్లస్ కంపెనీ తాజాగా కంప్యూటర్ కీ బోర్డును తయారు చేసింది. 81 ప్రో పేరుతో తయారు చేసిన ఈ కీబోర్డును మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులోకి తెచ్చింది. ఇది చూడటానికి కీక్రోన్ క్యూ 1 ప్రోను పోలినట్టుగా ఉంది. వన్ ప్లస్ కీబోర్డు 81 ప్రో రెండు ఆప్షన్లతో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో పీబీటీకి క్యాప్స్‌తో తీసుకొచ్చిన వింటర్ బోన్ ఫైర్ ఆప్షన్ కీబోర్డు ధర ₹179000గా ఖరారు చేసింది. ఇందులోని టాక్టిల్ స్విచ్‌లు ఎరుపు రంగులో ఉన్నాయి. రెండోదైన సమ్మర్ బ్రీజ్ ఆప్షన్. దీని ధర ₹19,9000 మాత్రమే. ఇందులో మార్బల్ కీ క్యాప్స్ ఉపయోగించారు. కీక్రోన్‌తో కలిసి వన్ ప్లస్ ఈ కీబోర్డును విడుదల చేసింది. 
 
సాధారణ కీక్యాప్స్, స్విచ్ పుల్లర్‌ను కూడా అదనంగా ఇస్తుంది. కీబోర్డును సిస్టంకు కనెక్ట్ చేసుకునేందుకు నాణ్యమైన టైప్ సికి కేబుల్‌ను కూడా అందిస్తుంది. ఇది వెయ్యి హెర్ట్జ్ పోలింగ్ రేటుకు కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. విడుదల చేసిన రెండు కీబోర్డుల డిజైన్‌లలో పెద్దగా తేడా కనిపించలేదు. అదేసమయంలో ఈ కీబోర్డుల రివ్యూలు కూడా పాజిటివ్‌గానే ఉన్నాయి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు