దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్నామొన్నటివరకు కేవలు మెట్రో నగరాల్లోనే సెంచరీలో కొట్టిన చమురు ధరలు ఇపుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ సెంచరీ దాటి.. రికార్డు స్థాయిలో ధరను పలుకుతున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు పెట్రోల్ ధర రూ.110గా ఉంది.
నిజానికి ఈ పెట్రోల్ ధరలు ఒక్కో రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉన్నాయి. విశాఖలో లీటరు పెట్రోలు ధర రూ.106.80 ఉంటే, విజయవాడలో రూ.107.63గా ఉంది. అయితే రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు పెట్రోలు ధర రూ.110గా ఉంది.
శ్రీకాకుళం జిల్లా కంచిలిలో లీటరు పెట్రోలు ధర రూ.108.92గా ఉంటే డీజిల్‌ను రూ.100.39కి విక్రయిస్తున్నారు. ఒక్క పెట్రోలే కాదు, వంట గ్యాస్ ధరల్లోనూ ఇలాంటి వ్యత్యాసమే ఉంది. విశాఖలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.841గా ఉంటే, అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రూ. 904గా ఉంది.