ఒకే కేంద్రంలో బహుళ విధమైన ఉత్పత్తులను కలిగి ఉండే ఈ స్టోర్‌లో కిరాణ ఉత్పత్తులు, పండ్లు మరియు కూరగాయలు, పాల ఉత్పత్తులు, కిచెన్‌వేర్, హోంవేర్ వంటి వాటితో పాటు మరెన్నో ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
దీంతోపాటుగా రూ.1499 విలువ గల కొనుగోలు చేసినప్పుడు కిలో పంచదారను రూ.9 కనీస ధరతో అందించడం వంటి ఇతర ఆకర్షణీయ పథకాల వల్ల భారతదేశవ్యాప్తంగా తమ నెలవారి కిరాణ సరుకుల కోసం ఎంచుకోదగిన ఉత్తమమైన సూపర్‌మార్కెట్‌గా రిలయన్స్ స్మార్ట్ నిలుస్తోంది. వీటన్నింటితో పాటుగా, ప్రధానమైన ఉత్పత్తులను, పండ్లు మరియు కాయగూరలపై ప్రతిరోజూ తక్కువ ధరలకే అందిస్తోంది.
తాజాగా ప్రారంభమైన బండ్లగూడా స్టోర్ కలుపుకొని తెలంగాణ రాష్ట్రంలో రిలయన్స్ స్మార్ట్ స్టోర్ల సంఖ్య 23కు చేరుకుంది. 20,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరిన ఈ స్టోర్ వినియోగదారుల షాపింగ్ అవసరాలకు అనుగుణంగా ఉత్తమమైన డిజైన్ మరియు లేఔట్ కలిగి ఉంది.
గత కొన్ని సంవత్సరాలుగా, రిలయన్స్ స్మార్ట్ తన వినియోగదారులకు సంబంధించిన దైనందిన మరియు ప్రత్యేక సందర్భాలకు తగిన అవసరాలను అన్ని రకాలైన ధరలతో కూడిన ఉత్పత్తులను అందిస్తోంది. వినియోగదారుడిపై ప్రత్యేక దృష్టి సారించిన రిలయన్స్ స్మార్ట్ అత్యుత్తమ షాపింగ్ అనుభూతిని తన వినియోగదారులకు అందిస్తోంది. లార్జ్ ఫార్మాట్ సూపర్ మార్కెట్ కేటగిరీలో విస్తృత శ్రేణిలో ఉత్పత్తులు అందిస్తూ వినియోగదారులకు ఉత్పత్తులకు సంబంధించినదే కాకుండా స్థలం పరంగా కూడా సారుప్యంగా అందుబాటులో ఉంది.