షాకింగ్ రూ. 20, రూ. 50 ఇలా ఉండబోతున్నాయా...? అవేనా...?

శనివారం, 12 నవంబరు 2016 (16:36 IST)
మొదట్లో రూ. 2000 కొత్త నోటు వాట్స్ యాప్ లో ఇలానే సర్క్యులేట్ అయ్యింది. దాన్ని చూసినవారు చాలామంది అబ్బే రూ. 2000 నోటేంటి.. అలా ఉండటమేంటి అనుకున్నారు. కొందరైతే ఎవరో ఆకతాయిలు ఇలా ఫోటోషాప్లో డిజైన్ చేసి పంపిస్తున్నారంటూ కామెంట్లు పోస్టు చేశారు. 
 
కట్ చేస్తే... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ. 500, 1000 నోట్లు రద్దు అని ప్రకటించిన రెండోనాడు అదే 2000 నోటు నిజంగానే దర్శనమిచ్చింది. ఇప్పుడు కూడా కొత్త రూ. 20, రూ. 50, రూ. 100 నోట్లు ఇవేనంటూ వాట్స్ యాప్ లో హల్చల్ చేస్తున్నాయి. మరి నిజంగా ఈ నోట్లను ప్రభుత్వం విడుదల చేసిందా లేదా చూడాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి