సాధారణంగా గృహ రుణాలు తీసుకునేటప్పుడు బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజుతో పాటుగా లీగల్, టెక్నికల్ ఛార్జీలను కూడా విధిస్తాయి. ఈ ఛార్జీల వల్ల చాలా మందిపై అదనపు భారం పడుతోంది. వినియోగదారులపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు ఎస్‌బిఐ ఈ అదనపు ఛార్జీలను తొలగించింది. అయితే ఈ అవకాశం ఫిబ్రవరి 28లోపు రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని ఒక ప్రకటనలో తెలిపింది.