చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసేవారి వయస్సు 2018 నవంబర్ 30 నాటికి 50 ఏళ్ల లోపు ఉండాలి. ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ, బీటెక్, ఎంసీఏ, కంప్యూటర్ సైన్స్, ఐటీలో ఎంఎస్సీ, ఎంటెక్ చదివినవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. ఐటీ రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలని ఎస్‌బీఐ తెలిపింది.
ఇకపోతే.. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్(క్రెడిట్ రివ్యూ) పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ముంబై/నవీ ముంబైలో పోస్టింగ్ ఉంటుంది. ఈ పోస్టులను రెగ్యులర్, కాంట్రాక్ట్ బేసిస్‌లో ఎంపిక చేయనుంది ఆర్‌బీఐ. ఇక వీటితో పాటు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులనూ భర్తీ చేయనున్నట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.