సెన్సోడైన్ 2025 వరల్డ్ ఓరల్ హెల్త్ డే క్యాంపెయిన్‌ను ప్రారంభానికి ముందస్తుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్

ఐవీఆర్

శుక్రవారం, 7 మార్చి 2025 (23:36 IST)
హాలియన్ గతంలో గ్లాక్సోస్మిత్‌క్లైన్ కన్స్యూమర్ హెల్త్‌కేర్‌కు చెందిన ప్రముఖ నోటి సంరక్షణ బ్రాండ్ సెన్సోడైన్, ‘ఆన్‌లైన్‌లో 24 గంటల్లో అత్యంత ఎక్కువ దంత పరీక్ష పరీక్షలను’ విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. మహా కుంభ్ 2025లో రికార్డు నెలకొల్పగా, ఈ ప్రయత్నంలో 27,000 మందికి పైగా వ్యక్తులు దంత పరీక్షలు చేయించుకున్నారు. ఇది చురుకైన నోటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి భారతీయులకు అవగాహన కల్పించడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. తన నిబద్ధతను మరింత ముందుకు తోడ్కొని వెళ్లేందుకు సెన్సోడైన్ కొత్తగా విడుదల చేసిన ₹20 ధరకు లభించే చిన్న టూత్‌పేస్ట్ ప్యాక్‌ను కూడా వితరణ చేసింది. ఇది సెన్సిటివిటీ రక్షణను మరింత సరసమైనదిగా, మరింత అందుబాటులోకి తీసుకువచ్చేలా తయారు చేశారు.
 
ఈ రికార్డు సెన్సోడైన్ ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవ ప్రచారానికి నాంది పలికింది.  ఇది మెరుగైన ఓరల్ హెల్త్ వైపు వ్యక్తులు మొదటి అడుగు వేయమని ప్రోత్సహించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఒక దశాబ్ద కాలంగా, సెన్సోడైన్ వినియోగదారులకు దంతాల సెన్సిటివిటీని ముందుగానే గుర్తించి పరిష్కరించుకునే సాధికారత కల్పిస్తూ, భారతదేశం వ్యాప్తంగా ‘‘చిల్ టెస్ట్’’లను నిర్వహించింది. ఈ ప్రయత్నం లక్షలాది మంది తమ దంతాల పరిస్థితిని తెలుసుకునేందుకు, సకాలంలో సమస్యను పరిష్కరించుకుని, మళ్లీ తమకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించేందుకు సహాయపడింది- మొత్తం మీద వారి జీవన నాణ్యతను మెరుగుపరచింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు