రిటైలర్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడానికి కోకా-కోలా ఇండియాతో స్కిల్ ఇండియా భాగస్వామ్యం
సోమవారం, 16 అక్టోబరు 2023 (21:33 IST)
ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని రిటైలర్ కమ్యూనిటీకి సాధికారత కల్పించేం దుకు, స్కిల్ డెవలప్‌మెంట్ & ఆంత్రప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ (MSDE) ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) స్కిల్ ఇండియా మిషన్ కింద సూపర్ పవర్ రిటైలర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించేందుకు కోకా- కోలా ఇండియాతో నేడిక్కడ తన భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఒడిశా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు.
గౌరవ కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, ఎన్ఎస్ డిసి సీఓఓ వేద్ మణి తివారీ, కోకా-కోలా ఇండియా & సౌత్ వెస్ట్ ఏషియా ప్రెసిడెంట్ సంకేత్ రే సమక్షంలో అధికారికంగా ఈ భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమం రిటైలర్ల సాధికారత, పురోగతిని సులభతరం చేస్తుంది. స్కిల్ ఇండియా శ్రామికశక్తికి తోడ్పాటు అందించే ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. నేటి ఆధునిక రిటైలింగ్ రంగంలో వారి శక్తిసామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించడం ద్వారా రిటైలర్‌లను శక్తివంతులుగా చేయడంపై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుంది. ఇది చిన్న,సూక్ష్మ చిల్లర వ్యాపారులకు శిక్షణ అందించడం, వినియోగదారుల ప్రవర్తనలు, వారి ప్రాధాన్యతలను బాగా అర్థం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానం, నైపు ణ్యాలను వారికి అందించడంపై ఈ కార్యక్రమం దృష్టి పెడుతుంది.
నిరంతరం మారుతున్న రిటైలర్ ఎకోసిస్టమ్‌లో విజయం సాధించడానికి, సంప్రదాయ రిటైలర్‌లకు వారి వ్యా పారాన్ని మరింత లాభదాయకంగా మార్చడానికి అవసరమైన సరైన నైపుణ్యంతో వారిని సన్నద్ధం చేయ డం, ఉత్తమ విధానాల గురించి అవగాహనను వ్యాప్తి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు, సాధనాలు, సాంకేతికతలను రిటైలర్‌లకు అందించడం, అదే విధంగా వారి వ్యాపార నైపుణ్యాలను నిర్మించడం దీని లక్ష్యం. సూపర్ పవర్ రీటైలర్ ప్రోగ్రామ్ అనేది రిటైలర్‌ల వృత్తిపరమైన అవసరాలకు అనుగుణంగా కస్టమర్ మేనేజ్‌మెంట్, ఇన్వెంటరీ, స్టాక్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ మొదలైన పరిశ్రమ-నిర్దిష్ట నైపుణ్యాలను అందజేస్తుంది, రిటైలర్‌ను నైపుణ్యం కలిగిస్తుంది, వారి జ్ఞానాన్ని పెంచుతుంది.
కార్యక్రమంలో భాగంగా, పాల్గొనేవారికి 14 గంటల శిక్షణ ఉంటుంది. ఇందులో రెండు గంటల తరగతి గది సెషన్, 12 గంటల డిజిటల్ శిక్షణ ఉంటాయి. ఆన్‌లైన్ మాడ్యూల్స్ కోసం మొబైల్, హ్యాండ్‌హెల్డ్ పరికరాలలో యాక్సెస్ చేయగల యాప్-ఆధారిత లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(LMS)తో పాటు ఫిజికల్ క్లాస్‌రూమ్ సెషన్‌లను ఈ శిక్షణ కలిగి ఉంటుంది. మాడ్యూల్స్ స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫామ్ (SID)లో హోస్ట్ చేయబడతాయి. వీడియోలు, టెక్స్ట్‌ల మిశ్రమంతో మల్టీమీడియా విధానం ద్వారా నేర్చుకునేందుకు వీలు కల్పించే అనుభవజ్ఞులైన శిక్షకుల ద్వారా శిక్షణ ఇవ్వబడుతుంది. క్లాస్‌రూమ్, ఆన్‌లైన్ శిక్షణ, అసెస్‌మెంట్ మాడ్యూల్స్ పూర్తయిన తర్వాత పాల్గొనేవారు సర్టిఫికేట్ అందుకుంటారు.
ఈ భాగస్వామ్యం కింద, స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ప్రోగ్రామ్ చేరికను విస్తరించడంలో కోకా-కోలా ఇండియాకు ఎన్ఎస్ డిసి మద్దతు ఇస్తుంది. పరిశ్రమ-నిర్దిష్ట నైపుణ్య అవసరాలకు అనుగుణంగా శిక్షణ కంటెంట్‌ను రూపొందించడం, మెరుగుపరచడం ఇందులో ఉంటాయి. అంతేగాకుండా, ప్రోగ్రామ్ అమలు కోసం శిక్షకుల నియామకాన్ని ఎన్ఎస్ డిసి సులభతరం చేస్తుంది. అవసరమైన శిక్షణ మౌలిక సదుపాయాలను అందించడం ద్వారా తిరుగులేని అభ్యాస అనుభవానికి వీలు కల్పిస్తుంది. ఈ సందర్భంగా గౌరవనీయ కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి & వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లా డుతూ, “ఈరోజు దుర్గాపూజ పవిత్ర వేడుకలు ప్రారంభమవుతున్నందున, మన రిటైలర్‌లను శక్తివంతం చేయడం, వారి వ్యాపారాలను విస్తరించడం, వినియోగదారుల అనుభవాలను మెరుగుపరచడంపై వారికి శిక్షణ అందించేందుకు మేం కోకా-కోలా ఇండియా భాగస్వామ్యంతో సూపర్ పవర్ రిటైలర్ కార్యక్రమాన్ని ప్రారంభించాం అని అన్నారు.
రిటైలర్ల వృద్ధికి మార్గం సుగమం చేయడం ద్వారా నైపుణ్యాల అందజేత, రీస్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని నేను విశ్వసి స్తున్నాను. ఈ రోజున ఈ కార్యక్రమంలో చేరిన, విజయవంతమైన స్వావలంబన కలిగిన రిటైలర్లందరినీ నేను అభినందిస్తున్నాను అని అన్నారు.