కరోనాతో ఉద్యోగి చనిపోతే... ఆయన రిటైర్మెంట్ వయస్సు వచ్చే వరకు నామినికి జీతం ఇస్తామని ప్రకటించింది. వారి కుటుంబాలకు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ కంటిన్యూ చేస్తామని టాటా స్టీల్ కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా.. కంపెనీలో ఫ్రంట్ లైన్ ఉద్యోగి మరణిస్తే వారి పిల్లలు గ్రాడ్యూయేషన్ చదువుకునే వరకు అవసరమయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించింది. ఈ మేరకు తన అఫిషియల్ సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ లేఖను పోస్టు చేసింది. దీంతో సోషల్ మీడియాలో టాటా స్టీల్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
"టాటా స్టీల్ సామాజిక భద్రతా పథకాలు ఉద్యోగులకు సహకరిస్తాయని.. ఉద్యోగుల కుటుంబాలకు గౌరవప్రదమైన జీవన ప్రమాణం, తద్వారా మరణించిన ఉద్యోగి / నామినీ వయస్సు 60 సంవత్సరాల వరకు జీతం లభిస్తుంది. తద్వారా వైద్య ప్రయోజనాలు, గృహ సౌకర్యాలను కూడా పొందగలుగుతారు." అని కంపెనీ సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.