పూర్తి సరికొత్త ఇన్నోవా హైక్రాస్ ధరలను ప్రకటించిన టయోటా కిర్లోస్కర్ మోటర్
గురువారం, 29 డిశెంబరు 2022 (17:02 IST)
టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకెఎం) నేడు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న తమ నూతన ఇన్నోవా హైక్రాస్ ధరలను వెల్లడించింది. టయోటా విడుదల చేసిన ఈ నూతన వాహనం 18,30,000 రూపాయల నుంచి 28,97,000 రూపాయలు (ఎక్స్‌షోరూమ్)లో లభిస్తుంది. టయోటా ఈ సరికొత్త కారును నవంబర్ 2022న విడుదల చేయడంతో పాటుగా బుకింగ్స్ కూడా ప్రారంభించింది.
స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్ గ్రేడ్
టయోటా నూతన గ్లోబల్ ఆర్కిటెక్చర్ (టీఎన్జీఏ) ఆధారంగా ఈ నూతన ఆఫరింగ్, టయోటా యొక్క అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, అత్యాధునిక సాంకేతికతతో కూడిన నాణ్యత, మన్నిక, విశ్వసనీతయను వేడుక చేస్తుంది. ఈ వైవిధ్యమైన ఇన్నోవా హైక్రాస్, అత్యంత ఆకర్షణీయంగా, అత్యాధునిక సాంకేతికత కలిగి ఉండటంతో పాటుగా భద్రతతో కూడిన సౌకర్యం, ఉత్సాహంతో కూడిన సవారీ వంటి వాటి చేత ప్రతి సందర్భంలోనూ కోరుకునే వాహనంగా నిలువడమే కాదు ఒంటరిగా లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించినప్పటికీ అత్యంత అనుకూలంగా ఉంటుంది. సెల్ఫ్ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ టెక్నాలజీ ఈ విభాగంలో అత్యుత్తమ ఇంధన సామర్థ్యం అందిస్తుంది. ఈ కారణం చేత హరిత భవిష్యత్ కోసం తెలివైన ఎంపికగా ఇన్నోవా హై క్రాస్ నిలుస్తుంది.
ఈ సందర్భంగా టీకెఎం సేల్స్ అండ్ స్ట్రాటజిక్ మార్కెటింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అతుల్ సూద్ మాట్లాడుతూ, భారతదేశంలో మా ఇన్నోవా హైక్రాస్ విడుదల చేయడం మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా ఈ వాహనానికి అపూర్వమైన స్పందన అందుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. అత్యున్నత ఫీచర్లు కలిగిన ఈ వాహనం ఎంపీవీ యొక్క విశాలత అందిస్తుంది. వినియోగదారుల అవసరాలను ఖచ్చితంగా తీరుస్తుంది.
నూతన ఇన్నోవా హైక్రాస్ ధరలు బ్రాండ్ ఇన్నోవా వారసత్వాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటుగా సస్టెయినబల్ మొబిలిటీ కోసం టయోటా యొక్క ప్రయత్నాలను వేగవంతం చేయనుంది. ఈ వైవిధ్యమైన వాహనం శక్తివంతమైన పనితీరు అందించడంతో పాటుగా వేగవంతమైన యాక్సలరేషన్ సైతం అందిస్తుంది. దీనితో పాటుగా దీని సౌకర్యం, భద్రతలు ఖచ్చితంగా అసాధారణ డ్రైవింగ్ అనుభవాలను అందించనున్నాయి అని అన్నారు.
ఈ నూతన ఇన్నోవా హై క్రాస్‌లో 5వ తరపు సెల్ఫ్ చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వ్యవస్ధ టీఎన్జీఏ 2.0 లీటర్ 4-సిలెండర్ గ్యాసోలిన్ ఇంజిన్‌తో ఉంటుంది. ఈ డ్రైవ్ సీక్వెన్షియల్ షిప్ట్‌తో మోనోకోక్ ఫ్రేమ్ ఉండటం చేత గరిష్టంగా 137 కిలోవాట్ (183.7 హెచ్‌పీ) శక్తిని అందిస్తుంది. ఇది వేగవంతమైన యాక్సలరేషన్ అందించడంతో పాటుగా ఈ విభాగంలో అత్యుత్తమంగా 23.23 కిలోమీటర్/లీటర్ మైలేజీ అందిస్తుంది. ఈ వాహనం టీఎన్జీఏ 2.0 లీటర్ 4 సిలెండర్గ్యాసోలిన్ ఇంజిన్‌ను డైరెక్ట్ షిఫ్ట్ సీవీటీ అవకాశంతో కూడా వస్తుంది. ఇది 129 కిలోవాట్ (171.6 హెచ్‌పీ) శక్తిని అందించడంతో పాటుగా ఈ శ్రేణిలో అత్యుత్తమంగా 16.13 కిలోమీటర్/లీటర్ మైలేజీ అందిస్తుంది.
ఈ నూతన ఇన్నోవా హై క్రాస్ వాహనాలు సూపర్ వైట్, ప్లాటినమ్ వైట్ పెరల్, సిల్వర్ మెటాలిక్, ఆటిట్యూడ్ బ్లాక్ మికా, స్పార్ల్కింగ్ బ్లాక్ పెరల్ క్రిస్టల్ షైన్, అవంత్ గ్రేడ్ బ్రాంజ్ మెటాలిక్ మరియు అత్యంత ఉత్సాహపూరితమైన నూతన కలర్ బ్లాకిష్ ఏగా గ్లాస్ ఫ్లేక్లో వస్తాయి. ఇంటీరియర్స్ బ్లాక్‌తో పాటుగా రెండు నూతన రంగులు చెస్ట్నట్ అండ్ బ్లాక్ మరియు డార్క్ చెస్ట్‌నట్‌లో వస్తూ అత్యాధునిక, ప్రీమియం అనుభూతులను అందిస్తుంది.
నూతన ఇన్నోవా హైక్రాస్ అత్యంత ప్రాచుర్యం పొందిన టయోటా అనుభవాలను మూడు సంవత్సరాల వారెంటీ/ఒక లక్ష కిలోమీటర్లు ద్వారా అందిస్తుంది. దీనిని 5 సంవత్సరాలు/2,20,000కిలోమీటర్ల వరకూ విస్తరించుకునే అవకాశం కూడా ఉంది. మూడు సంవత్సరాల పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఆకర్షణీయమైన ఫైనాన్షియల్ స్కీమ్స్ మరియు 8 సంవత్సరాలు/160,000కిలోమీటర్ల వారెంటీని హైబ్రిడ్ బ్యాటరీపై పొందవచ్చు.