సంవత్సరాంతాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వేడుక చేసుకునే మార్గం
బుధవారం, 28 డిశెంబరు 2022 (18:41 IST)
సంవత్సరాంతం సమీపించింది. నూతన సంవత్సరాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి వేడుక చేసుకోవడానికి మించిన మార్గం ఏముంటుంది. ఈ సంవత్సరం ఎన్నో మధురస్మృతులు ఉండి ఉంటాయి. వేటికవే ప్రత్యేకం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి వేడుక చేసుకునేందుకు సమయం.
మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్ అండ్ మార్కెటింగ్ మాట్లాడుతూ, గోల్డ్ డ్రాప్ వద్ద, మీరు మాతో పంచుకున్న సంతోషకర క్షణాలను వేడుక చేస్తున్నాము. ఈ సంవత్సరం మీరు మీ అభిమాన డిషెస్, మధుర క్షణాలను స్వాద్ జో జిందగీ సే జుడ్ జాయే అంటూ పంచుకున్నారు. మా మొత్తం లోహియా పరివారం ఈ సంవత్సరాంతపు వేళ మీకు నూతన సంవత్సరం మరెన్నో విజయాలను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము అని అన్నారు.
వేడుక ఏదైనా విందు ఉండాల్సిందే. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ అందరూ ఒకేచోట చేరే వేళ ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే... అందరూ కూర్చుని ఉన్నప్పుడు సంతోషకరమైన సంభాషణలను ప్రారంభించడానికి తియ్యందనాలు ఉండాల్సిందే. వీటితో పాటుగా కొత్త ఉత్సాహం ఉరకలెత్తే వేళ కాస్త హాట్ హాట్‌గా మురుకు, కలోంజీ, సుమాక్ లాంటి డిషెస్‌ను పక్కన పెట్టుకోవచ్చు. పార్టీలంటే కాక్‌టైల్స్ మాత్రమే కాదు మాక్‌టైల్స్‌తోనూ మజా చేసుకోవచ్చు. అదీ ఆరోగ్యవంతంగా. జామపండు జ్యూస్, టమోటా జ్యూస్‌తో వెరైటీలతో కాస్త కొత్తిమీర, జీలకర్ర పొడితో ఈ మాక్‌టైల్ మజా అందిస్తుంది.
ఇక పార్టీ మజా ప్రారంభించడానికి కరకరలాడే చిప్స్ ఉండాల్సిందే. ఎప్పటిలా బంగాళాదుంప చిప్స్ కాకుండా అరటి అయితే వెరైటీగానూ ఉంటుంది. ఈ చిప్స్‌లో ప్రయోగాలు చేయాలనుకుంటే, బిండీ పాప్‌కార్న్ ఉంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే బెండకాయ, కాస్త శెనగపిండి, పసుపు, కారం, ఉప్పుతో ఈ పాప్‌కార్న్ చేసుకోవచ్చు. పార్టీ అంటే ముక్క లేకుండా ఎలా అనే వారికి చికెన్ లేదంటే చేప ఉండనే ఉంది. అందునా ఈ పార్టీల సమయాలలో ఫ్రైల కే కదా క్రేజ్. ఈ ఫ్రై లను డీప్ ఫ్రై లేదంటే వోక్‌తో అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఉపయోగించే నూనెలే ఆరోగ్యవంతంగా ఉండాలి. గోల్డ్‌డ్రాప్ లాంటి నూనె అయితే ప్రపంచ శ్రేణిలో ఉండటంతో పాటుగా సూపర్ రిఫైండ్ ఆయిల్‌గా ఖ్యాతి గడించింది. తేలికగా ఉండటంతో పాటుగా వాసన లేకుండా, తక్కువగా పీల్చుకునే స్వభావం కలిగి, చక్కటి రుచికీ భరోసా అందిస్తుంది.
శాఖాహారుల కోసం సుందాల్ ఉంది. శెనగపప్పు, రజ్మా లేదంటే గ్రీన్ పీస్‌తో దీనిని తయారుచేస్తారు. ఉల్లిపాయ లేదంటే వెల్లుల్లి లేకుండా కొబ్బరి, స్పైసెస్ ఉపయోగించి దీనిని ఫ్రై చేస్తారు. ఇక ఈ విందు రుచులను చవిచూస్తూ సంభాషణలను మధురస్మృతుల వైపుకు మళ్లించినప్పుడు పక్కనే పాపడ్ కూడా ఉంటే మరింత సంతోషం దరి చేరినట్లే. మెయిన్ కోర్సు దగ్గరకు వచ్చేసరికి శాఖాహారం లేదా చికెన్, మటన్ బిర్యానీ ఉండాల్సిందే. ఈ బిర్యానీలలో కాస్త శాఫ్రాన్, రోజ్ వాటర్ లాంటివి జోడిస్తే రాయల్ టచ్ ఇవ్వొచ్చు. సంతోషకరమైన విందు ముగిసిన తరువాత డెస్సర్ట్స్ లేకపోతే ఎలా? కొబ్బరి లడ్డూలు ఓ ప్రత్యేకతను పార్టీకి తీసుకువస్తాయి. యాలుకలు, కొబ్బరి లేదంటే వైవిధ్యత కోసం చాక్లోట్ ఫుడ్జ్ బ్రౌనీ కలిపి వీటిని చేసుకోవచ్చు. ఈ తరహా వైవిధ్యమైన డిషెస్‌తో నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి సిద్ధమవండి. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉల్లాసంగా గడపండి.