ఎమ్‌బైపీసీ కోర్సును చేయాలనుకుంటే పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, బయొలాజికల్ సైన్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులుంటాయి. ఈ కోర్సును చేసినవారు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎమ్‌సెట్ పరీక్షల్లో అటు మెడిసిన్, ఇంజనీరింగ్ కోర్సులకు ప్రవేశ పరీక్ష రాసే వీలు కలుగుతుంది.
ఈ కోర్సును కేంద్రీయ విద్యాలయ(సెంట్రల్ స్కూల్)తిరుపతి-1లో ప్రవేశపెట్టినట్లు ఆ విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీధరన్ తెలిపారు. పదవ తరగతి ఆంగ్లమాద్యమంలో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులుకు ఈ కోర్సులో ప్రవేశం ఉంటుందని ఆయన తెలిపారు.
దీంతోబాటు సాధారణమైన బైపీసీ, ఎమ్‌పీసీ, కామర్స్ కోర్సులకుకూడా ప్రవేశం కల్పించనున్నామని, ఈ సదవకాశాన్ని అన్ని పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.
వివరాలకు ప్రిన్సిపాల్, కేంద్రీయ విద్యాలయ-1, రామ్‌నగర్ ఏరియా, చెన్నారెడ్డి కాలనీ, తిరుపతి. చిరునామాలో సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.