బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ : టెన్త్ విద్యార్హత.. వేతనం రూ.92 వేలు

గురువారం, 11 ఆగస్టు 2022 (15:59 IST)
భారత సరిహద్దు దళం (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ -బీఎస్ఎఫ్)లో 1635 పోస్టు భర్తీ కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో అసిస్సెంట్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ వంటి పోస్టులకు నోటిఫికేషన్ జారీచేశారు. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్), హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్, రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టులు ఉన్నాయి. ఆసక్తిక అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఈ పోస్టుల్లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్) పోస్టులు 11 ఉండగా, హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులు 312, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు (రేడియో ఆపరేటర్) 982, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు (రేడియో మెకానిక్) 330 పోస్టుల చొప్పున ఉన్నాయి. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే, సంబంధిత ట్రేడులో ఐటీఐ సర్టిఫికేట్ కలిగివుండాలి. పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్‌లో చూడొచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 25 యేళ్లలోపు వారై ఉండాలి. 
 
వేతనం నెలకు రూ.29,200 నుంచి రూ.92,300వరకు ఏఎస్ఐ పోస్టులకు చెల్లిస్తారు. అలాగే రూ.25,500 నుంచి రూ.81,100 వరకు (హెచ్.సి) పోస్టులకు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100గా ఉండాలి. 
 
రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్, షార్ట్‌హ్యాండ్ టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్, డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబరు ఆరో తేదీన చివరి తేదీగా నిర్ణయించారు. 
 
రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్ పోస్టులకు ఆగస్టు 20వ  నుంచి దరఖాస్తులు స్వీకరించి సెప్టెంబరు 28వ తేదీన చివరి తేదీగా నిర్ణయిస్తారు. పూర్తి వివరాల కోసం https://rectt.bsf.gov.in/ అనే వెబ్‌సైట్‌లో చూడొచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు