ప్రొఫెషనల్స్ కోసం హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాల జాబితాను విడుదల చేసిన లింక్డ్‌ఇన్

ఐవీఆర్

బుధవారం, 24 జనవరి 2024 (22:27 IST)
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్ హబ్ అయిన హైదరాబాద్‌లోని నిపుణులు ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ,  ధైర్యంగా కెరీర్‌లో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ నెట్‌వర్క్ లింక్డ్‌ఇన్ విడుదల చేసిన కొత్త అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, హైదరాబాద్‌లోని 10 మంది నిపుణులతో 9 మంది (92%) మంది నిపుణులు 2024లో కొత్త ఉద్యోగాన్ని పరిశీలిస్తున్నారు. 
 
మారుతున్న  నైపుణ్య అవసరాల వేగాన్ని ఏఐ వేగవంతం చేస్తున్నందున, 2015 నుండి భారతదేశంలో ఉద్యోగాల కోసం అవసరమైన నైపుణ్యాలు 30% మారాయని లింక్డ్‌ఇన్ డేటా చూపిస్తుంది. 2030 నాటికి, అవి ప్రపంచవ్యాప్తంగా 65% మారుతాయని అంచనా. ఈ మార్పుల నడుమ , ఉద్యోగ వేట సవాలుగా నిలువనుంది, కానీ హైదరాబాద్‌లోని నిపుణులు తాము ప్రత్యేకంగా వుండటానికి ప్రయత్నిస్తున్నారు. నగరంలోని 77% మంది నిపుణులు తమ ఉద్యోగ శోధనలో విజయం సాధించడానికి కొత్త మార్గాలను ప్రయత్నిస్తున్నారు. 86% మంది తమ రెజ్యూమ్/CVని రిక్రూటర్‌లకు (ఉదా. వీడియో ఫార్మాట్, డిజిటల్ రెజ్యూమ్) అందించడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు, ఇదే రీతిలో (86%) ఆన్‌లైన్ కోర్సులు/కొత్త నైపుణ్యాలను పొందడం కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. తమ ఉద్యోగ శోధనను మరింత మెరుగ్గా మార్చడంలో సహాయపడుతుందనే నమ్మకంతో  81% మంది నిపుణులు AIని ఉపయోగించడంపై ఆసక్తి చూపుతున్నారు.
 
నిపుణులు తమ శక్తియుక్తులను సరిగా వినియోగించుకోవటంలో సహాయపడటానికి, లింక్డ్ఇన్ హైదరాబాద్‌లో డిమాండ్ లో వున్న ఉద్యోగాల జాబితాను వెల్లడించింది:
 
1. సేల్స్ డెవలప్‌మెంట్ రిప్రజెంటేటివ్ 
2. అస్యూరెన్స్ అసోసియేట్
3. లీగల్ అనలిస్ట్
4. రిక్రూటర్
5. టాక్స్ అసోసియేట్
6. కస్టమర్ సక్సెస్ మేనేజర్
7. గ్రోత్ మేనేజర్
8. సైట్ రిలయబిలిటీ  ఇంజనీర్
9. లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ మేనేజర్
10. బ్యాక్ ఎండ్ డెవలపర్
 
భారతదేశంలోని 95% మంది రిక్రూటర్‌లు ఈ సంవత్సరం నూతన టాలెంట్‌లను స్వాగతించాలని యోచిస్తున్నందున, లింక్డ్‌ఇన్ వారికి సరైన అభ్యర్థులను కనుగొనడంలో మరియు వారి శ్రామిక శక్తిని భవిష్యత్తు నైపుణ్యాలతో సన్నద్ధం చేయడంలో సహాయపడాలని కోరుకుంటోంది. ఆ దిశగా, లింక్డ్ఇన్ కొత్త ఉత్పాదక AI సాధనాలను వెల్లడించింది.
 
రిక్రూటర్ 2024: లింక్డ్‌ఇన్ యొక్క కొత్త ఏఐ -సహాయక రిక్రూటింగ్ అనుభవం, నియామకాన్ని మరింత సమర్ధవంతంగా, సులభతరం చేస్తుంది. అందువల్ల టాలెంట్ లీడర్స్ వ్యూహాత్మక, వ్యక్తుల-కేంద్రీకృత పనిపై దృష్టి పెట్టవచ్చు. హైరర్లు, సహజ భాషా శోధన ప్రాంప్ట్‌లు అయిన- "ఐ వాంట్ టు హైర్ సీనియర్ గ్రోత్ మార్కెటింగ్ లీడర్" వంటివి ఉపయోగించవచ్చు. లింక్డ్‌ఇన్ యొక్క ఏఐ మోడల్‌లు, 1 బిలియన్‌కు పైగా నిపుణులు, 67.1 మిలియన్ కంపెనీలు మరియు లింక్డ్‌ఇన్‌ పై 41,000 నైపుణ్యాల నుండి ప్రత్యేకమైన పరిజ్ఙానంతో జతచేయబడి అభ్యర్థి రకాన్ని ఊహించవచ్చు. విస్తృతమైన అభ్యర్థుల నుండి అధిక-నాణ్యత గల అభ్యర్థి సిఫార్సులను హైరర్ వెతుకుతున్నారు మరియు అందిస్తున్నారు.
 
లింక్డ్‌ఇన్ లెర్నింగ్ యొక్క AI-ఆధారిత కోచింగ్: అన్ని రకాల ఉద్యోగాలకు వర్తించే అత్యంత డిమాండ్ ఉన్న రెండు నైపుణ్యాలు: నాయకత్వం మరియు నిర్వహణలో రియల్ టైమ్ సలహాను లింక్డ్‌ఇన్ పరీక్షిస్తోంది: అభ్యాసకులు :’ హౌ కెన్ ఐ డెలిగేట్ టాస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎఫెక్టివ్లి ?’ లాంటి ప్రశ్నను అడగవచ్చు. మీకు ఒకే తరహా సమాధానం అన్నిటికి సరిపోయేలా ఇవ్వడానికి బదులుగా, ఇది మీ నిర్దిష్ట పరిస్థితిని మరియు అనుభవాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మిమ్మల్ని స్పష్టమైన ప్రశ్నలను అడుగుతుంది మరియు లింక్డ్ఇన్ లెర్నింగ్ యొక్క నిపుణులైన బోధకుల నుండి వందల గంటల కంటెంట్ ఆధారంగా సలహాలు, ఉదాహరణలు మరియు అభిప్రాయాన్ని అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు