పుట్టగొడుగుల్ని వండే ముందు ఇలా చేస్తే..?

ఆదివారం, 2 జూన్ 2019 (12:33 IST)
పుట్టగొడుగుల్ని వండే ముందు.. పొడి వస్త్రంతో తుడిచి.. ఆపై ధారలా పడుతోన్న నీటితో కడగాలి. ఆ తరువాత మరోసారి తుడిచి వండుకోవచ్చు. ఇలా చేస్తే పుట్టగొడుగుల్లో దుమ్ము నశిస్తుంది. అలాగే ఆకుకూరల్ని కోయడానికి ముందు పెద్ద గిన్నె లేదా టబ్‌లో సగానికిపైగా నీళ్లు పోసి అందులో ఉంచాలి. 

 
ఆ నీటిలో చెంచా వంట సోడా వేసి బాగా కలపాలి. ఆపై ఆకుకూరల్ని బయటకు తీసి మంచి నీటితో కడిగి, వండుకోవాలి. ఇక కోసిన యాపిల్‌ ముక్కలపై నిమ్మరసం చల్లడం వల్ల అవి రంగు మారకుండా, ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. 
 
కొన్ని వంటింటి చిట్కాలు.. 
వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే స్పూను పాలు వేయాలి
క్యాబేజి ఉడికించేటపుడు వాసనరాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేస్తే సరిపోతుంది.
గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పు వేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి.
పాలు కాచేటపుడు పొంగకుండా ఉండాలంటే అంచుకు నూనె రాయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు