1. అన్నం వండేటప్పుడు ముద్దగా అవుతుందా.. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. ఉడికించేటప్పుడు అందులో స్పూన్ వంట నూనె వేస్తే పొడిపొడిగా ఉంటుంది. ఇక వడలు, గారెలు చేసేటప్పుడు నూనె చింది మీద పడుతుంటే.. నూనెలో రెండు స్పూన్ల నెయ్యి కలిపితే సరిపోతుంది.
3. పెనం, మూకుడు వంటి వాటికి పదార్థాల మరకలు పోకుంటే.. గిన్నెలు తోముకునే లిక్విడ్‌కు కొద్దిగా వంటసోడా, కొన్ని నీళ్ళు కలిపి రుద్దితే సరిపోతుంది. ఇక పెనానికి జిడ్డు బాగా పేరుకు పోయి ఎంతకూ పోలేదంటే.. పెనాన్ని వేడినీళ్ళల్లో 2 నుండి 3 గంటల పాటు ఉంచి.. తర్వాత నిమ్మ చెక్కతో రుద్దితే పోతుంది.
4. చేపముక్కల్ని నిల్వచేయాలా.. అయితే వాటికి కొద్దిగా ఉప్పు కలిపి డీప్ ఫ్రీజర్‌లో ఉంచితే ముక్కలు అంటుకోవు. ఐస్ పేరుకోదు. ఇంకా చెప్పాలంటే.. అరటి, పచ్చి అరటి ముక్కలను ఒక ఉడుకు రానిచ్చి తీసి వేయిస్తే అవి మృదువుగా వస్తాయి. రుచిగా ఉంటాయి.