భారతీయ నౌకాదళంలో కలకలం రేగింది. ముంబైలోని ఐఎన్ఎస్ అంగ్రే నావెల్ బేస్ సిబ్బందిలో 20 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఐఎన్‌ఎస్ అంగ్రే నావెల్ బేస్‌లో ఏప్రిల్ 7వ తేదీన ఓ సిబ్బందికి కరోనా సోకింది. అతన్ని నుంచి మిగతా వారికి కరోనా వ్యాప్తి చెందినట్లు నేవీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.