కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 2,96,050 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, 12781 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో మహారాష్ట్రలో 4004, ఢిల్లీలో 1530, కేరళలో 2786 కొత్త కేసులు వెలుగు చూశాయి.
అలాగే, కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 18 మంది చనిపోయారు. ఈ మరణాలతో కలుపుకుంటే మొత్తం మృతుల సంఖ్య 5,24,873గా ఉంది. ఈ వైరస్ నుంచి 8537 మంది కోలుకున్నారు.