కరోనా మహమ్మారి తీవ్రత జంతువుల్లోనూ మొదలైందా అనే అనుమానం తలెత్తింది సైంటిస్టులకు. జూ పార్క్‌లో ఉన్న పులికి.. అంటూ అక్కడక్కడ కేసులు బయటపడ్డా ఇప్పుడు అడవుల్లో తిరిగే జంతువుల్లోనూ కనిపిస్తున్నాయి. దానికి సాక్ష్యంగా నిలిచాయి జింకలో కనిపించిన యాంటీబాడీలు. మిచిగాన్, పెన్సీల్వేనియా, న్యూయార్క్, ఇల్లినాయీస్ ప్రాంతాల నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేశారు.
కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైన సమయంలో ఈ శాంపుల్స్ ను విశ్లేషించిన రీసెర్చర్లు.. తొలిసారి అడవి జంతువులో వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో సెర్చింగ్ మొదలుపెట్టారు. సెరో సర్వేలెనస్ వాడి ఆ జంతువును కనుగొనగా.. తెల్ల తోక ఉన్న జింకలో కొవిడ్ యాంటీబాడీలు కనిపించాయి. 40శాతం శాంపుల్స్ లో ఇదే ఫలితం వచ్చింది… ఆ జింకకు SARS-CoV2వచ్చి తగ్గి ఉండొచ్చని చెబుతున్నారు రీసెర్చర్లు.