అలాగే, కర్నాటక, హర్యానా రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్కరు చనిపోయారు. దేశ రాజధాని ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. హెచ్3ఎన్2 వైరస్ అనేది ఏ ఉప రకం. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా సాగుతున్నట్టు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వైరస్ సోకినవారికి జలుబు, శరీర నొప్పులు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే, ఈ వైరస్ క్రమంగా రోగి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుందని వైద్యులు తెలిపారు. ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఈ వైరస్ బారినపడి ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.