దేశంలో కొత్తగా 3,688 కరోనా పాజిటివ్ కేసులు

ఆదివారం, 1 మే 2022 (11:58 IST)
దేశంలో కొత్తగా మరో 3,688 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 3,324 కొత్త పాజిటివ్ కేసులు కావడం గమనార్హం. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,79,188కి చేరుకుంది. 
 
వీరిలో 4,25,36,253 మంది కరోనా నుంచి కోలుకోగా, మరో 5,23,843 మంది మరణించారు. అలాగే, 19,092 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఇదిలావుంటే, శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు మొత్తం 2,876 మంది కోలుకున్నారనీ, 40 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదలే చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు