దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిలో వేగం పెరిగింది. ఫలితంగా పలు రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, మహారాష్ట్రలో ఈ కేసుల పెరుగుల అధికంగా కనిపిస్తుంది. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గడిచిన 24 గంటల్లో మహారాష్ట్రలో ఏకంగా 85 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 252కు చేరింది.
అలాగే, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)లో 38 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఐఐఎస్ఈఆర్ నివేదికల్లో పాజిటివ్‌గా తేలిన 38 మందిలో ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేదని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. పూణె ల్యాబ్‌లో బయటపడిన 47 కేసుల్లో 43 మంది అంతర్జాతీయ ప్రయాణికులు కాగా, మూడు మాత్రం కాంటాక్ట్ కేసులని తేలింది.