వివరాల్లోకి వెళితే, సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామంలో ఒకే ఇంట్లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిలో ఇద్దరు పెద్దలు, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మమత వెల్లడించారు. దీంతో... అందరినీ హోం ఐసోలేషన్‌లోనే ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
ఇలా 9 మందికి కరోనా సోకడానికి కారణం వారి ఇంట జరిగిన వివాహమేనని తేలింది. ఇటీవలే ఈ ఇంట్లో వివాహం జరిగింది. అయితే, కరోనా అనుమానిత లక్షణాలు కనిపించడంతో.. టెస్ట్ చేయించుకున్నారు. పెళ్లి కుమారుడు సహా ఆ కుటుంబంలోని ఎనిమిది మందికి పాజిటివ్‌గా తేలింది. పెళ్లి కూతురికి మాత్రం నెగిటివ్‌గా వచ్చింది.