90 ఎమ్ఎల్ రమ్, ఓ టీస్పూన్ మిరియాల పొడి, రెండు ఆమ్లెట్లు.. ఈ కాంబోను ట్రై చేస్తే కరోనానే భయపడి దగ్గరికి రాదంటున్నారు ఈ కౌన్సిలర్. రమ్‌లో మిరియాల పొడి కలుపుకుని తాగాక ఆమెట్లు తింటే ఈ మహమ్మారి పీడ విరగడైపోతుందని ఆయన చెప్పుకొచ్చారు.
ఎన్నో చికిత్సలను ప్రయత్నించిన మీదట తనకు ఇది ప్రభావశీలంగా కనిపించిందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ఓ రాజకీయ నాయకుడిగా చెప్పట్లేదని, కరోనా కమిటీ సభ్యుడిగా చెబుతున్నానని కూడా కామెంట్ చేశారు. ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.