ఆరు కరోనా టెస్టింగ్ ఆంబులెన్సులను ప్రభుత్వానికి సమకూర్చేందుకు అవసరమైన నగదుకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్‌కు మల్లారెడ్డి అందజేశారు. అలాగే చెరువుల సుందరీకరణ, శుద్ధీకరణ, ఎకో టూరిజం పార్కుల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్‌ను మల్లారెడ్డి కోరారు.
కాగా.. గతంలో కరోనా రక్కసిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి సినీ తారాలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి భారీ విరాళాన్ని ప్రకటించారు.
మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ తరపున రూ.50 లక్షలు, మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల రూ.25 లక్షలు, ఇతరులు అందజేసిన రూ.47 లక్షల విరాళాల చెక్కులను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అందించారు.