అత్యవసర పరిస్థితులలో 108 వాహనాలు సకాలంలో రాకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆంబులెన్స్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే తాము నిబంధనలకు మేరకే చార్జీలు వసూలు చేస్తున్నామని ఆంబులెన్స్ నిర్వాహకులు అంటున్నారు. ఏదేమైనా కరోనా లాంటి విపత్కర పరిస్థితిల్లో ఆంబులెన్స్ సామాన్యులకు తలకు మించిన భారంగా మారిందని అంటున్నారు. 108 వాహనాల సంఖ్యను ప్రభుత్వం పెంచితే ప్రజలకు ఇబ్బందులుండవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.