యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, అక్టోబర్ 28 నుండి వెలుగులోకి వచ్చిన కోవిడ్ కేసులలో హెచ్వీ.1 వేరియంట్ వాటా 25.2శాతం ఉంది. జూలైలో వెలుగులోకి వచ్చిన కేసులలో దీని వాటా 0.5 శాతం. కానీ ఇప్పుడు అది 12.5 శాతానికి పెరిగింది. ఫలితంగా, ఇది అమెరికాలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్‌గా మారింది.
హెచ్‌వి.1ని ఓమిక్రాన్ మనవడిగా పరిగణించవచ్చని సెంటర్ ప్రొఫెసర్ డాక్టర్ విలియం షాఫ్నర్ వెల్లడించారు. జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు ఈ HV.1 కోవిడ్ వేరియంట్ లక్షణాలు.