ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలిచి కప్‌ను ముద్దాడుతుందని పాకిస్థాన్ దేశానికి చెందిన క్రికెట్ మహిళా విరాభిమాని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆమె ఓ సెల్ఫీ వీడియోను షేర్ చేశారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టుపై భారత్ విజయం సాధిస్తుందని పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళా క్రీడాభిమాని అభిప్రాయపడ్డారు. క్రికెట్ క్రీడకు ప్రాంతాలతో సంబంధం ఉండదని, అన్ని దేశాలను ఒకే రీతిలో చూడాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
మరోవైపు, చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించాలని దేశంలోని పలు ప్రాంతాల్లో పూజలు చేస్తున్నారు. హైదరాబాద్, ఖైరతాబాద్‌లో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. చాంపియన్ ట్రోఫీని భారత్ గెలవాలని ప్రత్యేక హోమం, పూజలు చేసినట్టు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు వెల్లడించారు.
అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో కూడా సాధువులు హోమం చేశారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయాలని, టీమిండియా విజయం సాధించాలని కోరుతూ సాధువులు హోమాలు చేశారు.